రేణిగుంటలో దారుణం : కుమార్తెపై తండ్రి అత్యాచారం

Written By ఠాగూర్
Updated: సోమవారం, 1 నవంబరు 2021 (08:14 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న రేణిగుంటలో ఓ దారుణం జరిగింది. 14 యేళ్ల కన్న కూతురిపై ఓ కామాంధ తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రేణిగుంట మండలానికి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను తిరుపతిలో వైద్యపరీక్షల కోసమని అక్టోబరు 24వ తేదీన ఇంటి నుంచి తీసుకెళ్లాడు. 
 
ఆపై రేణిగుంట, తిరుపతి మార్గంలోని లక్ష్మీపురం కాలనీకి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లికి ఆలస్యంగా చెప్పడంతో ఆదివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

అన్నీ చూడండి

బోరున విలపించిన కోలీవుడ్ నటి : ఎందుకో తెలుసా?

Manchu Lakshmi: సంప్రదాయ బోధనే చిన్నారుల ఎదుగులకు పునాది :మంచు లక్ష్మి

అందుకే బెనాక గోల్డ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వున్నా : నాగబాబు

పెయిడ్ ప్రీమియర్స్ తో 3.13 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన చెన్నై లవ్ స్టోరీ

వంద దేవుళ్ళు మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన జీతెలుగు

తర్వాతి కథనం
Show comments