Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో మరో దారుణం.. వేధింపులు తట్టుకోలేక మరో విద్యార్థిని ఆత్మహత్య

Written By ఠాగూర్
Updated: సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (09:12 IST)
తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిలపై జరుగుతున్న వేధింపులు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. కాకాతీయ వైద్య వైద్య కాలేజీలో పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి సీనియర్ల వేధింపులు భరించలేక విషపు ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచింది. ఆమె అంత్యక్రియలు కూడా ఇంకా పూర్తికాకముందే తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ బీటెక్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. సీనియర్ వేధింపులు తట్టుకోలేక ఆమె బలవన్మరణానికి పాల్పడింది.
 
ఇది కూడా వరంగల్ జిల్లాలోనే వెలుగు చూసింది. ఈ జిల్లాలోని నర్సంపేటలో జయముఖి ఇంజనీరింగ్ కాలేజీలో తృతీయ సంవత్సరం బీటెక్ చేస్తున్న రక్షిత అనే యువతిని అదే కాలేజీకి చెందిన రాహుల్ అనే యువకుడు గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. కానీ, ఆమె మాత్రం అతని వేధింపులను భరిస్తూనే వచ్చింది. 
 
ఈ క్రమంలో ఆ విద్యార్థిని ఫోటోలను రాహుల్ సోషల్ మీడియాలో పోస్టే చేశాడు. దీంతో మనస్తాపం చెందిన రక్షిత ఆత్మహత్య చేసుకుంది. వరంగల్‌లోని బంధువుల ఇంటికి వెళ్లిన రక్షిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
 
గతంలో రాహుల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, అతని ప్రవర్తనలో మార్పు రాలేదు కదా మరింతగా ఎక్కువయ్యాయి. శివరాత్రి రోజున భూపాలపల్లికి వెళ్లిన ఆమె కాలేజీకి వెళుతున్నట్టు ఇంట్లో చెప్పి బయలుదేరింది. కానీ, కాలేజీకి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశఆరు. ఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత ఆమె తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. దీంతో కాలేజీ మాన్పించి బంధువుల ఇంట్లో ఉంచారు. ఈ క్రమంలోనే ఆమె ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. 

అన్నీ చూడండి

Rashmika Mandanna: ఆనంద్ సినిమా గురించే ఆలోచిస్తాడు, కష్టపడుతుంటాడు, ఎపిక్ చూస్తా : రష్మిక మందన్నా

Chandra Siddharth : బ్రయిన్ మ్యాపింగ్.. కథాంశంగా చంద్ర సిద్ధార్థ్ చిత్రం ‘ఈ పాట కోరినవారు.....

సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రం ధర్మన్ రెండవ షెడ్యూల్ పూర్తి

Ananya Nagalla: రెండు భిన్నమైన జోనర్లతో అనన్య నాగళ్ల చిత్రం లీసా సిద్ధం

వేణు ఊడుగుల సమర్పణ లో అడ్వెంచర్ మూవీగా చంద్రయాన్

తర్వాతి కథనం
Show comments