శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (20:57 IST)

ఛీ.. ఛీ.... అయ్యోర్ల అక్రమ సంబంధం... రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త...

romance
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మంగపేటలో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు పాడుపనికి పాల్పడ్డారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన వీరు పాడు పని చేస్తూ, ఉపాధ్యాయురాలి భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. దీంతో వారిద్దరినీ తాళ్లతో కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న ఓ టీచర్‌ను కొత్తబెస్తగూడెం పాఠశాలకు డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు. ఇదే పాఠశాలలో పని చేసే ఓ ఉపాధ్యాయురాలితో ఆయనకు పరిచయం ఏర్పడింది. కాల క్రమంలో ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, గత కొన్ని రోజులుగా భార్య ప్రవర్తన రావడాని ఉపాధ్యాయురాలి భర్త పసిగట్టాడు. 
 
ఈ క్రమంలో సోమవారం రాత్రి అక్రమ సంబంధం పెట్టుకున్న టీచర్, టీచరమ్మ ఒకే ఇంట్లో ఏకాంతంగా ఉన్న సమయంలో టీచరమ్మ భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆయన తన బంధు మిత్రులకు సమాచారం అందించాడు. వారు వాళ్లిద్దరిని తాళ్లతో కట్టేసి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత స్థానిక పోలీసులకు అప్పగించారు. వివాహేతర సంబంధం విషయమై గతంలో పలుమార్లు మందలించినా తీరు మారలేదని ఉపాధ్యాయిని భర్త, అతని బంధువులు తెలిపారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.