గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (10:45 IST)

తెలంగాణాలో వైఎస్.షర్మిల ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు - అరెస్టు.. పాదయాత్రకు మళ్లీ బ్రేక్

yssharmila
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై శనివారం ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాలమూరు జిల్లాలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పాల్గొని మాట్లాడుతూ సిట్టింగ్ ఎమ్మెల్యే బానోతు శంకర్‌‍ నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 
 
ముఖ్యంగా, అధికారాన్ని అడ్డుపెట్టుకుని శంకర్ నాయక్ అవినీతి అక్రమాలకు, భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. దీంతో బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాలమూరు జిల్లా పోలీసులు షర్మిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. ఫలితంగా షర్మిల పాదయాత్రకు మరోమారు బ్రేక్ పడింది. 
 
కాగా, గతంలో వరంగల్ జిల్లాలో పాదయాత్ర సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై కూడా షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. ఆయనను పరుష పదజాలంతో దూషించారు. దీంతో ఆమె యాత్రను బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొనడంతో ఆమె పాదయాత్రకు ఇచ్చిన అనుమతిని రద్దు చేసి షర్మిలను అరెస్టు చేశారు.