1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జూన్ 2022 (10:39 IST)

చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని విద్యార్థి ఆత్మహత్య

చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఓ న్యాయ విద్యార్థికి వచ్చింది దీంతో ఆ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... తిరునెల్వేలి జిల్లాకు చెందిన సల్మాన్ (19) అనే  యువకుడు చెన్నైలో ఉన్న ఓ కాలేజీలో చదువుతున్నాడు. స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నారు. 
 
అయితే, ఇటీవల ఊరికి వెళ్లివచ్చిన సల్మాన్.. గత రెండు మూడు రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. తన స్నేహితులతో పాటు రూంమేట్స్‌తో మాట్లాడటం కూడా మానేశాడు. ఈ క్రమంలో సల్మాన్ తన గదిలోనే ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
అయితే, ఆ యువకుడు చనిపోయే ముందే ఓ సూసైడ్ లేఖ రాసిపెట్టాడు. మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నాడు. పైగా, తాను దాచిపెట్టిన రూ.5 వేల నగదును తన తల్లికి అప్పగించాలని కోరాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.