Daily Horoscope
✕

ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య.. దోపిడి దొంగలని డ్రామా చేసింది..

Written By సెల్వి
Updated: శనివారం, 11 ఏప్రియల్ 2026 (12:01 IST)
Crime news
భర్తను చంపే భార్యల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. వివాహేతర సంబంధాల కారణంగా భార్యాభర్తల అనుబంధాలు మంటగలిసిపోతున్నాయి. అఫైర్ల కారణంగా జరిగేన నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో దారుణ చోటుచేసుకుంది. 
 
ప్రియుడితో కలిసి భర్తను ఓ మహిళ హత్య చేయించింది. ఆపై దోపిడిగా తతంగాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ దొరికిపోయింది. పక్కా ప్లాన్ ప్రకారం భర్తను దోపిడి దొంగలే చంపించారని నమ్మించాలనుకుంది. 
 
కానీ పోలీసులు భార్య అసలు గుట్టును పోలీసులు బయటపెట్టారు. ప్రియుడితో కలిసి తన భర్త దేవకృష్ణ పురోహిత్‌ను నిందితురాలు ప్రియాంక, ఆమె ప్రియుడు కమలేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
విచారణలో కృష్ణ తలపై పదునైన ఆయుధంతో కొట్టి, ఇంట్లోని విలువైన వస్తువులను దోచుకెళ్లినట్లు ప్రియాంక డ్రామా చేసింది. ఈ ఘటనలో దేవకృష్ణ తీవ్రగాయాలతో మృతి చెందాడు. భర్తను చంపేందుకు లక్ష రూపాయలకు ఒక కిల్లర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితులపై హత్య, కుట్ర కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అన్నీ చూడండి

Soori 7: సూరి ఏడవ కథానాయకుడిగా సూరి 7 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది

Naga Chaitanya :మైథికల్ థ్రిల్లర్ నాగ చైతన్య వృషకర్మ సరికొత్త అడ్వెంచర్ పోస్టర్

Anupama: నా పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి లేదు. ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే అన్నారు : అనుపమ పరమేశ్వరన్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ హీరోగా అనిల్ సుంకర చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్

Teja Sajja: గరివిడి లక్ష్మి మ్యూజికల్ కాన్సర్ట్ తో గౌరవం తీసుకొచ్చే సినిమా : తేజ సజ్జా

తర్వాతి కథనం
Show comments