గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (10:42 IST)

క్రైం టీవీ షోలు అంటే పిచ్చి.. కుతూహలం పట్టలేక హత్య చేసిన యువతి

murder
ఆ యువతికి క్రైమ్ స్టోరీస్ అంటే అమితమైన పిచ్చి. ఈ తరహా సీరియల్స్ చూసే సమయంలో కుతూహలం పట్టలేక పోయేది. దీన్ని తట్టులేక ఆమె కన్నబిడ్డను హత్య చేసి చంపేసింది. ఈ దారుణం సౌతాఫ్రికాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
జంగ్ యూ యంగ్ అనే 23 యేళ్ల యువతికి క్రైమ్ టీవీ కార్యక్రమాలు, ఆ తర్వాత పుస్తక పఠనం అంటే అమితమైన పిచ్చి. ఈ పిచ్చిలో పడిపోయిన ఆమె చివరకు హత్య చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని భావించింది. ఈ ఉత్సుకత కాలక్రమంలో మరింతగా పెరిగిపోయింది. 
 
ఈ కుతూహలాన్ని అణుచుకోలేక చివరకు దారుణానికి తెగబడింది. హత్య చేయాలో పక్కాన్ ప్లాన్ రూపొందించింది. ప్రైవేటు ట్యూటర్ల కోసం ఉద్దేశించిన ఓ యాప్ ద్వారా ఓ ఉపాధ్యాయురాలిగా తన బలిపశువుగా ఎంచుకుంది. 
 
తన కుమార్తెకు ట్యూషన్ చెప్పాలంటూ తొలుత బాధితురాలిని యాప్ ద్వారా సంప్రదించింది. ఆ తర్వాత తన కుమార్తె మీ వద్దకే వస్తుందని బాధితురాలిని నమ్మించింది. ఆ తర్వాత ఓ రోజు బాలిక వేషంలో నిందితురాలే స్వయంగా మహిళ ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత ఆమెను దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసింది. ఆ శరీర భాగాలను ఓ సూట్‌కేసులో సర్ది సమీపంలోని ఓ అడవిలో విసిరేసింది.
 
ఆ తర్వాత ఆ మహిళ కనిపించకుండా పోయిందని నమ్మించేందుకు వీలుగా మృతురాలికి సంబంధించిన గుర్తింపు కార్డులు, ఫోన్లు తానే తీసేసుకుంది. అయితే, నిందితురాలిన ట్యూటర్ ఇంటి వద్ద దింపిన ట్యాక్సీ డ్రైవర్‌కు అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
మహిళా ట్యూటర్‌ను చంపినందుకు బాధగా ఉందని చెప్పిన జంగ్.. హత్య అనుభవం ఎలా ఉంటుందో స్వయంగా తెలుసుకోవాలనే ఇదంతా చేసినట్టు పోలీసులకు చెప్పింది. దీంతో నిందితురాలికి మానసిక రుగ్మతలు ఉన్నాయేమో తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.