మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By
Last Updated : శనివారం, 27 అక్టోబరు 2018 (16:39 IST)

ఈ 3 చిట్కాలతో మేకప్ తొలగించవచ్చు..

ఫంక్షన్స్‌కి ఎక్కడికైనా వెళ్లినప్పుడు మేకప్ తెగ వేసేస్తుంటారు. మరి దానిని శుభ్రం చేయాడానికేమో తికమకపడుతుంటారు. ఇలా చేస్తే.. సులువుగా మేకప్ శుభ్రం చేసుకోవచ్చును..
 
1. వాటర్‌ఫ్రూఫ్ మేకప్‌ని శుభ్రం చేయడం కష్టమే.. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. కొబ్బరినూనెనలో కొద్దిగా తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. ఇప్పుడు దూదితో మేకప్‌ను శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. 
 
2. మేకప్ సులభంగా శుభ్రం చేయడానికి తేనె మంచి ఔషధంగా పనిచేస్తుంది. కనుక తేనెలో కొద్దిగా వంటసోడా కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. 
 
3. ఆలివ్ నూనెలోని రసాయనాలు అందానికి చాలా ఉపయోగపడుతాయి. మరి ఈ నూనెలో మేకప్ ఎలా తొలగించుకోవాలో చూద్దాం.. పాలలో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి అందులో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకోవాలి. ఇలా చేస్తే మేకప్ త్వరగా శుభ్రం చేసుకోవచ్చు.