Dharma Sangrah
✕

శ్రావణ మాసం... శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరం.. భక్తులకు నైతిక బలం..

Written By సెల్వి
Updated: గురువారం, 13 ఆగస్టు 2026 (09:42 IST)
Shravana Masam 2026
శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రవణం పేరుమీద వచ్చిన మాసం కావడంతో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం.  అందుకే దీనిని శ్రావణ మాసం అని పిలుస్తారు. శ్రీకృష్ణ భగవానుడు పుట్టినది, హయగ్రీవోత్పత్తి  జరిగింది, గరుడుడు అమృతభాండాన్ని సాధించింది శ్రావణ మాసంలోనే. 
 
గురుకులాల్లో విద్యార్థులు వేదపాఠం మొదలయ్యే ముందు చేపట్టే సంవిధానాన్ని శ్రావణి అని కూడా అంటారు. శుద్ధ సాత్విక స్వరూపంలో వెలిగే జగన్మాత శ్రీమహాలక్ష్మీ దేవి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ, వారిని కార్యోన్ముఖుల్ని చేసే శక్తియుక్తుల్ని అందిస్తుందని నమ్మకం. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. 
 
త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుని ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు.
 
శ్రావణ మాసం మందు ఆచరించ వలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. 
Sravana Masam
 
శ్రావణ మాసంలో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

ప్రకాశం జిల్లా తీరాన్ని తాకనున్న మురసు తీవ్రతుపాను, ఈ మండలాలు వారు జాగ్రత్త

ఆస్తి కోసం దారుణ హత్య, తమ్ముడి భార్య గొంతుకి పంచెకట్టి ఈడ్చుకెళ్లి చంపిన బావలు

తిరుపతిలో ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ కాంట్రాక్ట్ ఉద్యోగిని దారుణ హత్య

భయపెడుతున్న మురసు తుఫాను - ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు

ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌తో దీపావళి జరుపుకోవచ్చు : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

03-11-2026 మంగళవారం ఫలితాలు - మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది...

02-11-2026 సోమవారం ఫలితాలు - పనుల్లో శ్రమ, చికాకులు అధికం...

01-11-2026 ఆదివారం నాటి రాశి ఫలితాలు- ఆ మొత్తంలో కొంత దాచుకోవడం మంచిది..

01-11-2026 నుంచి 07-11-2026 వరకు వార ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

01-11-2026 నుంచి 30-11-2026 నవంబర్ మాస ఫలితాలు - యత్నాలు విరమించుకోవద్దు- లక్ష్యానికి చేరువలో ఉన్నారు..

తర్వాతి కథనం
Show comments