Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

వరలక్ష్మీ వ్రతం 2026: ఆగస్టు 21, శుక్రవారం నాడు ఇలా పూజిస్తే..?

Written By సెల్వి
Updated: బుధవారం, 19 ఆగస్టు 2026 (16:37 IST)
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. 2026 సంవత్సరంలో వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 21, శుక్రవారం నాడు నిర్వహించబడుతుంది. ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించి, వ్రత కథను వినడం, తోరాన్ని కట్టుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. 
 
వివాహిత మహిళలతో పాటు యువతులు కూడా మంచి భవిష్యత్తు, కుటుంబ సుఖసంతోషాల కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతంలో కలశ స్థాపనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. కలశాన్ని అలంకరించి, లక్ష్మీదేవి రూపంగా భావించి పూజిస్తారు. అనంతరం అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టకం, వరలక్ష్మీ వ్రత కథను పారాయణం చేస్తారు. 
 
పూజ అనంతరం కుటుంబ సభ్యులకు ప్రసాదం పంచి, సుమంగళులకు తాంబూలం ఇవ్వడం సంప్రదాయం. ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం ఆచరించిన వారికి, దీపారాధన చేసి, దూప దీప నైవేద్యాలు సమర్పించి, దానధర్మాలు చేసి భక్తి, శ్రద్ధలతో అమ్మవారిని పూజించిన వారికి అష్టలక్ష్ముల ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
 
వరలక్ష్మీ వ్రతం రోజున స్థిర లగ్నంలో అమ్మవారిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభించి, మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో పూజ ముగించడం మంచిది. భక్తి శ్రద్ధలతో ఆచరించే ఈ వరలక్ష్మీ వ్రతం దీపావళి పూజతో సమానమైన ఫలితాలను ఇస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంకా చారుమతి కథను చదవడం, కనకధారా స్తోత్రాన్ని పఠించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. 
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

అనిశ్చితిలో H-1B మీద పనిచేస్తూ గ్రీన్ కార్డ్ క్యూలో ఉన్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల భవిష్యత్తు

రాహుల్ గాంధీకి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్... ఏంటది?

నా భర్తకి ఉద్యోగం ఇప్పిస్తామని రష్యా సైన్యంలో చేర్పించారు.. మహిళ ఫిర్యాదు

తీర్థం ఇస్తే తాగినట్టు నటిస్తూ వేళ్ల సందుల్లోంచి కిందకు వదిలేస్తారు : వైకాపా నేతలపై విజయసాయి ఫైర్ (Video)

కూతురుని కాపురానికి పంపకుంటే మనవరాలి ఫోటోలు బయటపెడతా : అత్తకు అల్లుడి వార్నింగ్

అన్నీ చూడండి

మహాలయ అమావాస్య రోజున చేయకూడని పనులు ఏంటంటే?

Navaratri Home Mandir Vastu 2026: నవరాత్రి.. ఇంటి నుంచి తొలగించాల్సిన వస్తువులు.. వాస్తు టిప్స్

08-10-2026 - గురువారం నాటి రాశి ఫలాలు - పనిభారం పెరిగినా సమయపాలనతో?

Trayodashi: శ్రాద్ధ త్రయోదశి రోజున పితృదేవతలకు ఏం చేయాలి?

07-10-2026 - బుధవారం రోజువారి రాశి ఫలాలు - అనవసరమైన ఖర్చులను తగ్గించి..?

తర్వాతి కథనం
Show comments