Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఖీ ఎప్పుడు కట్టాలి? కట్టేటప్పుడు చదవాల్సిన స్తోత్రం ఏమిటి?

Written By సిహెచ్
Updated: మంగళవారం, 29 ఆగస్టు 2023 (23:02 IST)
సోదరీసోదరుల దృఢమైన అనుబంధమునకు గుర్తు రాఖీ పండుగ. ఈ ఏడాది 30 ఆగస్టు 2023 బుధవారం ఉదయం శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమి తిథి ఉదయం 10:58 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు 31 ఆగస్టు 2023 ఉదయం 7:05 గంటలకు ముగుస్తుంది. కనుక 30న జరపుకోవచ్చంటున్నారు.
 
సోదరి రాఖీ అనే పవిత్ర తోరాన్ని తన సోదరుడి మణికట్టుకు కట్టి అతడు సంతోష ఆనందాలతో అన్ని రంగాలలోను విజయం పొందాలని ఆకాంక్షిస్తుంది. సోదరుడు తన సోదరికి ఏ కష్టం వచ్చినా కాపాడుతానని వాగ్దానం చేస్తాడు. రాఖీ రోజు ఉద‌యాన్నే త‌లార స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించి రాఖీకి సిద్ధ‌ప‌డ‌తారు.
 
రాఖీని క‌ట్టేట‌ప్ప‌డు `యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల` అనే స్తోత్రాన్ని చ‌దువుతారు. ఎలాగైతే ఆ విష్ణుమూర్తి, బ‌లిచక్ర‌వ‌ర్తిని బంధించాడో, నువ్వు అలాగే ఇత‌ణ్ని అన్ని కాలాల‌లోనూ విడ‌వ‌కుండా ఉండు అని దీని అర్థం.
ఆ త‌రువాత హార‌తిని ఇచ్చి, నుదుట‌ తిల‌కాన్ని దిద్దుతారు. దీనికి ప్రతిగా సోద‌రులు త‌మ ప్రేమ‌కు  గుర్తుగా వారికి చ‌క్క‌టి బ‌హుమ‌తుల‌ను అందిస్తారు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments