Biodata Maker
✕

కార్తీక పౌర్ణమి, కార్తీక దీపం ఎందుకు వెలిగించాలి?

Written By జయ
Updated: సోమవారం, 23 నవంబరు 2026 (23:39 IST)
శివునికి, విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్త్యం కలిగినది అని పురాణాలుతెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెలరోజులూ చేసే పూజల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి పూజల ఫలితం ఒక్కటీ మరొక ఎత్తు, అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి. వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాల వల్ల వాటి నుండి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి, వాతావరణం శుద్ది అవుతుంది. తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఈ పౌర్ణిమకు త్రిపుర పూర్ణిమ అని మరొకపేరు. 
 
తారకాసురుడి ముగ్గురు కుమారులూ బ్రహ్మను మెప్పించి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. ఎవరివల్లా మరణం లేకుండా వరంకోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథం కాని రథం మీద, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణంకాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురినీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వర బలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. 
 
వివిధ లోకవాసులు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గరకెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది.
 
మేరు పర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీమహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందనీ పురాణ కథనం. ఈరోజు చేసే స్నానం, దీపారాధన, ఉపవాసం లాంటి అన్నింటిలోనూ ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి.
 
ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వలన ఈ కాలపు వాతావరణపరంగా మనకు ఎంతో ఆరోగ్యప్రదం. ప్రస్తుత కాలంలో ఉద్యోగాల బిజిలో కాని ఇతర ఏ కారణం చేతనైనా రోజు దేవుని పూజించి దీపారాధన చేసే సమయం లేనివారు, ఆచరించలేని వారు ఈ పౌర్ణమినాడు ఆచరిస్తే చాలు, నెలంతా చేసిన ఫలితం కలుగుతుంది.
About Author
జయ
Content provider.... Read More

అన్నీ చూడండి

కారు కొనివ్వలేదని పెళ్లి రద్దు చేసుకుని వధువును వదిలేసి వచ్చాడు

బెంగళూరులోని ఆస్తి నా అత్తగారిది.. షర్మిలకు జగన్ ఝలక్

దేశంలో బుల్లెట్ రైలు ట్రయల్ రన్‌కు ముహూర్తం ఖరారు : మంత్రి అశ్వినీ వైష్ణవ్

పిఠాపురం జనసేనలో అసమ్మతి సెగలు - ఎంపీ పీఏపై దాడికి యత్నం?

ఎన్వీడియా బోర్డు సంచలన నిర్ణయం... సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్

అన్నీ చూడండి

కార్తీక సోమవారం రోజు శివుడిని, చంద్రుడిని పూజిస్తే..?

23-11-2026 సోమవారం దిన ఫలాలు - పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు...

22-11-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. స్నేహితులు లేదా సహచరుల సహకారంతో...?

గణేశుని ప్రసన్నం చేసుకునేందుకు శక్తివంతమైన బీజమంత్రం, విశిష్టతలు

22-11-2026 నుంచి 28-11-2026 వరకు వార ఫలితాలు- తొందరపడి మాట ఇవ్వవద్దు

తర్వాతి కథనం
Show comments