బుధవారం, 27 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. రత్నాల శాస్త్రం
Written By chj
Last Modified: సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (18:41 IST)

బంగారాన్ని ఆకర్షించే స్వర్ణముఖి శిల...

స్వర్ణముఖి నదిలో లభించే దైవీక శిల స్వర్ణముఖి శిల. పంచయతన పూజ చేయటానికి ఉపయోగించే దైవీక శిల స్వర్ణముఖి శిల. స్వర్ణముఖి శిల అగ్నితత్వ శిల, అమ్మవారికి సంకేతం. ఈ శిలలో వెండి, బంగారాలకు వున్న లక్షణాలు ఉన్నాయి. ఈ శిల చూడటానికి అక్కడక్కడ వెండిలా తెల్లగాను,

స్వర్ణముఖి నదిలో లభించే దైవీక శిల స్వర్ణముఖి శిల. పంచయతన పూజ చేయటానికి ఉపయోగించే దైవీక శిల స్వర్ణముఖి శిల. స్వర్ణముఖి శిల అగ్నితత్వ శిల, అమ్మవారికి సంకేతం. ఈ శిలలో వెండి, బంగారాలకు వున్న లక్షణాలు ఉన్నాయంటారు. ఈ శిల చూడటానికి అక్కడక్కడ వెండిలా తెల్లగాను, సువర్ణంలో బంగారు వర్ణంతోను ఉంటుంది. అందుకే స్వర్ణముఖి రెండవ బంగారంగా ప్రసిద్ధి చెందింది. ఈ స్వర్ణముఖి శిలను పూజలో ఉంచి పూజించిన ఇంట బంగారం కొనుగోలు శక్తి పెరుగుతుందని విశ్వాసం.
 
ఇంట బంగారం నిండాలంటే ఆ ఇంట స్వర్ణముఖి ఉండి తీరాల్సిందేననే నమ్మకం చాలామందిలో వుంది. ఎందుకంటే స్వర్ణముఖి శిలకు బంగారాన్ని ఆకర్షించే శక్తి ఉండటమేనని చెప్తుంటారు. అంటే ఆ ఇంట నివశించే వారికి బంగారు ఆభరణాలు మునుపటికంటే ఎక్కువుగా దక్కుతాయని నమ్మకం. అలా లభించిన బంగారం శాశ్వతంగా వారికి స్వంతమవుతాయనీ, తాకట్టు పెట్టడం, చోరి అవ్వడం వంటివి జరుగవని చెప్తారు.

ముఖ్యంగా ప్రతి ఏడాది వచ్చే అక్షయతృతీయ నాడు స్వర్ణముఖిని పూజిస్తే ఇంట బంగారు వర్షం కురుస్తుందని నమ్మకం. స్వర్ణముఖి నది దక్షిణ భారతదేశంలో ప్రవహించే ఒక నది. చిత్తూరు జిల్లాలో ప్రముఖ నది. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తి ఈ నది ఒడ్డున నెలకొని ఉంది. తిరుపతి-చంద్రగిరి మధ్య తొండవాడ సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం. 
 
ధూర్జటి తన రచనల్లో దీన్ని మొగలేరు అని ప్రస్తావించాడు. ఈ నది భీమ, కళ్యాణి నదులతో సంగమించి తొండవాడలో త్రివేణి సంగమంగా మారి, ఉత్తర వాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో విలీనం అవుతుంది. పూర్వం అగస్త్య మహర్షి బ్రహ్మను గురించి తపస్సు చేసి ఈ నదిని దేవలోకం నుంచి క్రిందికి తెప్పించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తున్నది.
 
శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటప్పుడు ఆలయ నిర్మాణంలో సహకరించిన కూలీలు రోజూ సాయంత్రం నదిలో స్నానం చేసి ఆ నది అంతర్ భాగం నుండి ఇసుక మరియు రాళ్లను వారి చేతుల్లోకి తీసుకుంటే అవి వారి కష్టానికి తగిన ప్రతిఫల విలువ చేసేంత బంగారంగా మారేదట. అందుకే ఈ నదికి స్వర్ణముఖి అని పేరు వచ్చిందంటారు.