శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (22:42 IST)

జ్వరం మూడు రోజులు దాటినా తగ్గకపోతే అదేనేమో?

వైరస్ ఇన్‌ఫెక్షన్ వల్ల వచ్చే డెంగ్యూను తెచ్చేవి దోమలే. నిల్వ వున్న నీటిలో డెంగ్యూను వ్యాప్తి చెందించే దోమలు పెరుగుతాయి. కాబట్టి నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. కొందరు కొబ్బరి బొండాలు, కొబ్బరి కాయలను కొట్టేసి ఆ చిప్పలను ఇంటి ప్రక్కనే వేసేస్తుంటారు.
 
వర్షం పడగానే వాటిలో నీరు చేరుతుంది. అక్కడ ఈ డెంగ్యూ దోమలు తిష్ట వేస్తాయి. కాబట్టి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. సాధారణంగా రాత్రిపూటే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ దోమ తెరనో, మస్కిటో రిపెల్లెంట్స్ ద్వారానో వాటి నుంచి తప్పించుకోవచ్చు. డెంగ్యూ వ్యాధి గురించి మరికొంత అవగాహనకు ఈ క్రింది పటాన్ని చూడండి.
 
కలుషిత నీరు, ఆహారం కలిగించే మరో ముఖ్యమైన సమస్య టైఫాయిడ్. కలుషిత నీరు, ఆహారపదార్థాలపై మూతలు పెట్టకపోవడం దీనికి ప్రధాన కారణాలు. సాల్మొనెల్లా టైఫి అనే బాక్టీరియా టైఫాయిడ్‌ని కలిగిస్తుంది. తీవ్రస్థాయి జ్వరం, ఒంటినొప్పులు, తలనొప్పి, కొందరిలో వాంతులు ఉంటాయి. 
 
అలాగే, నిమ్మజాతి పండ్లను ఆరగించడం వల్ల జలుబు, తుమ్ములు వస్తుంటాయని అంటారు. నిజానికి వీటిలోని సి-విటమిన్ ఇమ్యూనిటీ పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఆస్తమా లాంటి అలర్జీలున్నవాళ్లు వీటిని తీసుకుంటే మాత్రం సమస్య పెరుగుతుంది. 
 
ఈ వర్షాకాలంలో వారానికి ఒక్కసారి మాత్రమే తలస్నానం చేయడం మంచిది. పండ్లను బాగా కడిగి ఆరగించాలి. నీటిని కాచి, చల్లార్చి మాత్రమే తాగాలి. సలాడ్స్ తీసుకోవడం మానివేయాలి. విరేచనాలను నిర్లక్ష్యం చేయవద్దు. 
 
మూడు రోజులు దాటినా జ్వరం, ఒంటినొప్పులు, జలుబు తగ్గకపోతే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను కలవాలి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించినట్టయితే, వర్షాకాలంలో ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా మనలను మనం కాపాడుకోవచ్చు.