శనివారం, 25 మార్చి 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified గురువారం, 1 డిశెంబరు 2022 (22:50 IST)

పూనమ్ కౌర్‌కి ఫైబ్రోమైయాల్జియా వ్యాధి, లక్షణాలు ఏమిటి?

poonam kaur
నటి పూనమ్ కౌర్ ఫైబ్రోమైయాల్జియా అనే అరుదైన వ్యాధితో పోరాడుతోందని ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. గత రెండేళ్లుగా ఈ వ్యాధితో ఆమె ఇబ్బందిపడుతుందని సమాచారం. ఈ వ్యాధికి కేరళలో ఆమె చికిత్స చేయించుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఫైబ్రోమైయాల్జియా యొక్క 7 సంకేతాలు ఏమిటో తెలుసుకుందాము.
 
శరీరమంతా నొప్పితో బాధపడుతుంటారు.
 
వళ్లంతా దృఢత్వంతో గట్టిగా మారుతుంటుంది.
 
విపరీతమైన అలసటతో సతమతం.
 
డిప్రెషన్, ఆందోళనలో కూరుకుపోవడం.
 
నిద్ర సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు.
 
ఆలోచన, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతతో సమస్యలు.
 
మైగ్రేన్‌లతో సహా తలనొప్పి వస్తుంటుంది.
 
ఇది చాలా సుదీర్ఘమైన వ్యాధి అని వైద్యులు చెపుతున్నారు.