బరువు తగ్గాలనుకుంటే రోజుకో గ్లాసు బీట్ రూట్ రసం తాగండి..
బీట్‌రూట్ రసాన్ని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బీట్‌రూట్‌ను నిత్యం తీనేవారికి గుండె సమస్యలు ఉండవని ఇప్పటికే పరిశోధనలు తేల్చాయి. బీట్‌రూట్ వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. బీట్‌రూట్ వల్ల రక్తంలో నైట్రేట్ రెట్టింపవుతుంది. దీనివల్ల కండరాలు చురుగ్గా పనిచేస్తాయి. అంతేగాకుండా.. రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజు బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిది.
ఇలా రోజూ గ్లాసుడు బీట్ రూట్ రసం తాగితే రోజంతా ఉత్సాహంగా వుండవచ్చు. ఇది ఎనర్జీ డ్రింక్ కంటే ఎక్కువ ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. మిమ్మల్ని రోజంతా చురుగ్గా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అలసట కూడా రాదు. బీట్‌రూట్‌లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, సిలు ఎదిగే పిల్లలకు తోడ్పడతాయి. పిల్లలు రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే కడుపులో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ అందుతుంది. బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది.
బీట్ రూట్ జ్యూస్‌ను రోజూ తాగితే హైబీపీ సమస్య ఉండదు. గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. ముఖ్యంగా బీట్ రూట్ రసం కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ వల్ల లివర్ శుభ్రమవుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.