నల్ల జీలకర్రతో మధుమేహం పరార్.. ఇడ్లీ, సూపుల్లో వాడితే? (Video)
నల్ల జీలకర్రను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఈ విత్తనాల పొడిని బ్రెడ్, బిస్కట్లు, రొట్టెలు, ఇడ్లీ, టీ, సూప్స్‌ల్లో వేసుకుని తీసుకుంటారు. దీనిని రోజువారీ తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. తేనె, నల్ల జీలకర్ర విత్తనాల పొడి, వెల్లుల్లిని కలిపి ఔషధంగా తయారుచేస్తారు. దీన్ని వాడితే జలుబు, దగ్గు తగ్గుతాయి.
నల్లజీలకర్ర పొడి రుచి ఉల్లి, మిరియాల రుచిని తలపిస్తుంది. వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, జింక్, మాంగనీస్, కాపర్, ఐరన్ ఖనిజ పోషకాలుంటాయి. ఈ విత్తనాల్లోని థైమో క్వినోన్ బయోయాక్టివ్ కాంపోనెంట్‌గా పనిచేస్తుంది. ఇది చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్నిస్తుంది.
హానికారక బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల నుంచి జీర్ణాశయాన్ని కాపాడతాయి. శక్తిమంతమైన యాంటీబ్యాక్టీరియల్‌గా పనిచేస్తాయి. వీటి వాడకం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే నల్ల జీలకర్ర పొడిని అతిగా వాడకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.