మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 22 అక్టోబరు 2018 (14:17 IST)

గురక తీవ్రతను బట్టి వ్యక్తి మరణించే అవకాశాన్ని కనిపెట్టొచ్చు.. ఎలా?

చూడటానికి చిన్న సమస్యలా అనిపించే గురక ఎంతో ప్రాణాంతకమైంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం వంటి వాటికి కారణంగా ఉంది. ఆరోగ్యపరంగా ఇలా అనేక సమస్యలకు దారితీస్తోంది. అలాగే, కుటుంబంలో కలతలకూ గురక కారణమవుతోంది. భర్త/భార్యకు గురక సమస్య ఉందన్న కారణంగా ఎన్నో జంటలు విడాకులు తీసుకున్న సందర్భాలు లేకపోలేదు. 
 
నిద్రిస్తున్న సమయంలో శ్వాస సరిగ్గా ఆడకపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఈ సమస్య వస్తుంటుంది. ఈ తీవ్రత పెరిగే కొద్దీ ఇది అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా(ఓఎస్ఏ)గా మారుతుంది. అయితే ఈ ఓఎస్ఏను బట్టి ఒక వ్యక్తి మరణించే అవకాశాన్ని ముందుగానే గుర్తించవచ్చని ఓ పరిశోధనలో తేలింది. ఈ మేరకు అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ రెస్పిరెటరీ అండ్‌ క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌లో ఓ కథనం ప్రచురితమైంది.
 
ఇదిలావుంటే, ప్రమాదకరంగా మారిన గురక సమస్యకు లండన్ శాస్త్రవేత్తలు ఓ పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. సిలికాన్‌తో తయారు చేసిన ఈ ఉంగరంలో రక్తంలో ఆక్సిజన్‌ లెవెల్స్‌ గుర్తించే సెన్సార్లను అమర్చారు. నిద్రలో గురక సమస్యకు బ్లడ్‌ ఆక్సిజన్‌ రీడింగ్స్‌ పడిపోవడం సంకేతంగా భావిస్తారు. 
 
ఈ ఉంగరం ద్వారా ఆక్సిజన్‌ రీడింగ్‌ను పసిగట్టి వైద్యులకు కీలక సమాచారం అందజేసే వెసులుబాటు ఉంది. ప్రతి మూడు రోజులకోసారి ఈ ఉంగరాన్ని చార్జి చేసుకుంటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా, ఒంటరిగా ఉంటున్న వారికి ఈ రింగ్‌ ఎంతో ఉపయుక్తమని స్లీప్‌ ఎక్స్‌పర్ట్‌ డాక్టర్‌ నీల్‌స్టాన్లీ తెలిపారు. దీని ఖరీదు రూ.7500గా ఉందని వైద్యులు చెబుతున్నారు.