గురువారం, 28 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 5 జులై 2018 (11:25 IST)

బెడ్‌రూమ్‌కు స్మార్ట్ ఫోన్లు వద్దు.. హాలుకే పరిమితం చేస్తే?

ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లే. చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే ఒక్క క్షణం గడపలేని వారి సంఖ్య పెరిగిపోతుంది. ఉదయం నుంచి రాత్రి నిద్రించేంత వరకు స్మార్ట్ ఫోన్లను తెగవాడేసే వారు అధికమవుతున్నారు. అయితే స్మార్ట

ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లే. చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే ఒక్క క్షణం గడపలేని వారి సంఖ్య పెరిగిపోతుంది. ఉదయం నుంచి రాత్రి నిద్రించేంత వరకు స్మార్ట్ ఫోన్లను తెగవాడేసే వారు అధికమవుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ రేడియోషన్ ద్వారా ముప్పు పొంచి వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే  నిత్య‌జీవితంలో వైర్‌లెస్ క‌నెక్టివిటీ ఒక భాగమైపోయింది. 
 
సెల్‌ఫోన్ సిగ్న‌ళ్లు, వై ఫై టెక్నాల‌జీ, రిమోట్ వ‌ర్కింగ్ వంటి విధానాల వ‌ల్ల తెలియ‌కుండానే మన ఆరోగ్యం వైర్‌లెస్ సిగ్నళ్ల రేడియేషన్‌కి గురవుతుంది. ఇలా చాలాకాలం పాటు రేడియేషన్‌కు మానవ శరీరం గురవడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్, ఇన్‌ఫెర్టిలిటీ వంటి సమస్యలతో పాటు అంతుచిక్కని రోగాలు వచ్చే ఛాన్సుందని వైద్యులు చెప్తున్నారు. రేడియేషన్ ప్రభావం కారణంగా ముక్కు, గొంతు, చెవికి సంబంధించిన రుగ్మతలు తప్పవట. 
 
రోజురోజుకీ వైర్‌లెస్ రేడియేష‌న్ త‌రంగాల సాంద్ర‌త పెరుగుతోంద‌ని.. తద్వారా అంతు చిక్కని రోగాలు మానవాళిని వెంబడిస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే రాత్రిపూట స్మార్ట్ ఫోన్లను పడక గదికి తేవడం కూడదని.. హాలులోనే వాటిని పరిమితం చేయడం మంచిదని వారు సూచిస్తున్నారు. 
 
రింగ్ టోన్‌ వాల్యూమ్ పెంచేసి హాలులో స్మార్ట్ ఫోన్లను వుంచడం ద్వార పిల్లల్లో రేడియేషన్ ప్రభావం చాలామటుకు తగ్గుతుంది. అలాగే పడకగదిలో వైఫై వంటి టెక్నాలజీ ఉపయోగించే పరికరాలు వుండకపోవడం చాలామంచిదని వైద్యులు సూచిస్తున్నారు.