కీరదోసకాయలను తింటే కిడ్నీల్లో రాళ్లు...?

సిహెచ్| Last Modified శనివారం, 10 ఆగస్టు 2019 (20:44 IST)
కీరదోసకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది ఛాతిలో మంటను తగ్గిస్తుంది. దేహంలోని విష పదార్థాలను బయటకు పంపివేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ కీరదోసకాయలను తింటే కిడ్నీల్లో రాళ్లు కూడా కరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. శరీరాన్ని రీహైడ్రేట్ చేయడంలో కీరదోసకాయ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

దీనిలో తక్కువ క్యాలరీలు ఉండటం చేత బరువు తగ్గాలనుకునే వారికి చక్కగా ఉపయోగపడుతుంది. చర్మాన్ని సంరక్షించే ఎన్నో రకాల ఔషధ గుణాలు కీరదోసకాయల్లో ఉన్నాయి. అందుకే వీటిని సౌందర్య సాధనంగానూ వాడుతున్నారు. వీటిలో ఉండే పొటాషియం, మెగ్నిషియం, సిలికాన్ చర్మానికి మేలు చేస్తాయి.

అండాశయ, రొమ్ము, ప్రోస్టేట్, గర్భాశయ క్యాన్సర్‌లను నిరోధించే ఔషధ గుణాలు కీరదోసలో పుష్కలంగా ఉన్నాయి. మూత్రాశయ సంబంధ ఇన్‌ఫెక్షన్లు కీరదోస రాకుండా చూస్తుంది. చిగుళ్ల సమస్యలు, నోటిలో ఏర్పడే బ్యాక్టీరియాను కీరదోస నిర్మూలిస్తుంది. కనుక మన ఆహారంలో కీరదోసకు చోటివ్వాల్సిందే.దీనిపై మరింత చదవండి :