సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 26 సెప్టెంబరు 2018 (12:07 IST)

బాదం పప్పుల్ని పొట్టు తీసి తింటే బరువు తగ్గుతారా?

బరువు తగ్గాలనుకునేవారు.. రోజుకు ఐదేసి బాదంలను పొట్టు తీసి తినాలి. ఇలా చేస్తే పొట్ట నిండిన భావన కలుగుతుంది. శరీరానికి తగిన శక్తి అందుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు.. బాదంతో పాటు కీరదోస, యాపిల్ వం

బరువు తగ్గాలనుకునేవారు.. రోజుకు ఐదేసి బాదంలను పొట్టు తీసి తినాలి. ఇలా చేస్తే పొట్ట నిండిన భావన కలుగుతుంది. శరీరానికి తగిన శక్తి అందుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు.. బాదంతో పాటు కీరదోస, యాపిల్ వంటివి తీసుకుంటే సులువుగా బరువును తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఎందుకంటే.. బాదంలో విటమిన్‌-ఇ, మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. ఇతర పోషకాలు కూడా ఎక్కువే. అందుకే బరువు తగ్గాలనుకునేవారు..  రోజూ ఉదయం అల్పాహారంతో పాటు కీరా ముక్కలు తీసుకోవాలి. ఇందులో ఎక్కువశాతం నీరే ఉండటం వల్ల కెలొరీలు చాలా తక్కువగా అందుతాయి. తిన్నాక చాలాసేపటి వరకూ ఆకలి వేయదు. 
 
కుదిరితే భోజనానికి ముందు ఒక కీరాదోస కాయను తీసుకోగలిగితే అన్నం తక్కువ తినే ఆస్కారం ఉంటుంది. తద్వారా బరువు సులభం తగ్గొచ్చు. బాదం, కీరదోసతో పాటు శెనగలు, బఠాణీలు, పెసర మొలకలు, తృణధాన్యాలు తీసుకుంటే ఒబిసిటీ దరిచేరదు.