శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Mohan
Last Modified: బుధవారం, 26 సెప్టెంబరు 2018 (10:58 IST)

నెయ్యి వేసుకోవడంలేదా? ఐతే ఇవి తెలుసుకోండి...

నెయ్యి సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే పదార్థం. ఆయుర్వేద పరంగా తీసుకున్నట్లయితే ఔషధాలతో పాటు ఆహారంలో నెయ్యి పాత్ర కూడా ఎక్కువనే చెప్పవచ్చు. ఆహారానికి రుచితో పాటు సువాసనను జోడిస్తుంది. నెయ్యి మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా శారీరక ఎదుగుదలకు ఎంతగానో

నెయ్యి సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే పదార్థం. ఆయుర్వేద పరంగా తీసుకున్నట్లయితే ఔషధాలతో పాటు ఆహారంలో నెయ్యి పాత్ర కూడా ఎక్కువనే చెప్పవచ్చు. ఆహారానికి రుచితో పాటు సువాసనను జోడిస్తుంది. నెయ్యి మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా శారీరక ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది. నెయ్యి చేకూర్చే లాభాలేమిటో ఒకసారి చూద్దాం.
 
1) నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు అధిక స్థాయిలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. దీనిని రోజువారీ తీసుకున్నట్లయితే, శరీరంలో కొవ్వును కరిగించడంతో పాటు శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
 
2) తక్షణ శక్తినిస్తుంది - ఆయుర్వేదశాస్త్రం ప్రకారం నెయ్యిలో ఉన్న కొవ్వు పదార్థాలను లివర్ పీల్చుకోవడమే కాకుండా త్వరగా దానిని కరిగిస్తుంది.
 
3) కేన్సర్ ప్రమాదాల ప్రభావాన్ని తగ్గిస్తుంది- నెయ్యిలో ఉండే కన్జుగేటెడ్ లినోలిక్ యాసిడ్(CLA) కేన్సర్ మరియు మధుమేహం రాకుండా కాపాడుతుంది.
 
4) కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది- నెయ్యిలో ఉండేటువంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, హృదయం పనితీరుని మెరుగుపరుస్తుంది.
 
5) రోజువారీ నెయ్యిని తీసుకోవడం వలన కడుపులో ఆమ్లాల విడుదలకు ఎంతగానో మేలు చేయడంతో పాటు జీర్ణశక్తిని పెంచుతుంది. కడుపులో మంటను తగ్గించడం మరియు జీర్ణ వ్యవస్థను సక్రమంగా పని చేసేలా చేస్తుంది.
 
6) నెయ్యిని ఆయుర్వేదంలో చర్మ మాయిస్చరైజర్‌గా వాడతారు. ఇది చర్మాన్ని మృదువుగా చేయడమే కాకుండా కావాల్సిన న్యూట్రియంట్స్‌ను అందిస్తుంది.
 
7) నెయ్యి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, దీనిని ఆహార తయారీలో క్రమంగా వాడటం వలన కీళ్ల నొప్పులు తగ్గుతాయి. దీనిని నిల్వ చేసుకోవచ్చు మరియు ఇందులో ఎలాంటి మాలిన్యాలు ఉండవు, ఇది చాలా స్వచ్ఛంగా ఉండటం వలన శరీరానికి ఎలాంటి హాని కలగదు.
 
8) కంటి చూపును మెరుగుపరుస్తుంది, దగ్గును నియంత్రిస్తుంది మరియు మలబద్ధకం నుండి విముక్తినివ్వడంతో పాటు జీవక్రియను పెంచుతుంది.