శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (15:19 IST)

వర్షాకాలంలో కార్న్ ఆయిల్ వాడితే ఎంత మేలో తెలుసా?

వర్షాకాలంలో కార్న్ ఆయిల్ వాడితే తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. ఇందులోని లో కెలోరీలు శరీరంలో ఫ్యాట్‌ను చేరనివ్వవు. అందుకే వర్షాకాలంలో ఆవనూనెలు, నువ్వుల నూనెలకు బదులుగా తేలికైన కార్న్ ఆయిల్, ఆలి

వర్షాకాలంలో కార్న్ ఆయిల్ వాడితే తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. ఇందులోని లో కెలోరీలు శరీరంలో ఫ్యాట్‌ను చేరనివ్వవు. అందుకే వర్షాకాలంలో ఆవనూనెలు, నువ్వుల నూనెలకు బదులుగా తేలికైన కార్న్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వాడితే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నూనెల ద్వారా జీర్ణశక్తి పుంజుకుని వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 
 
అలాగే వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి రుగ్మతలను దూరం చేసుకోవాలంటే.. ద్రవ పదార్థాలను అధికంగా తీసుకోవాలి. సూప్‌లు తరచుగా తీసుకుంటూ వుండాలి. గ్రీన్ టీ తాగడం ఉత్తమం. ఆహారంలో పీచుపదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఓట్స్, బ్రౌన్ రైస్, బార్లీ తీసుకోవడం మంచిది. పీచుపదార్థం కడుపులోని మలినాల్ని శుభ్రం చేస్తుంది. 
 
వానాకాలంలో శరీరంలోని జీర్ణప్రక్రియలు చురుగ్గా ఉండవు. తిన్నది అంత తొందరగా జీర్ణం అవ్వదు. అందుచేత తేలికపాటి ఆహారాన్ని నాలుగైదు సార్లు తీసుకోవాలి. అలాగే నిమ్మరసంలోకి తేనెను కలుపుకొని ప్రతి రోజు ఉదయాన్నే గ్లాసుడు తాగితే హాయిగా ఉంటుంది. వేప, పసుపు, మెంతులను ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలి. ఇవి మంచి యాంటీ బయాటిక్స్‌గానూ పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.