శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (12:54 IST)

ఇంటి భోజనంతో మధుమేహం పరార్

రోజూ ఇంటి భోజనం తీసుకునే వారిలో మధుమేహం దరిచేరదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం చేసే వారికి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయని.. అదే ఇంటి భోజనం తీసుకునే వారిలో

రోజూ ఇంటి భోజనం తీసుకునే వారిలో మధుమేహం దరిచేరదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో  భోజనం చేసే వారికి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయని.. అదే ఇంటి భోజనం తీసుకునే వారిలో మధుమేహం వచ్చే అవకాశాలుండవని వైద్యులు సూచిస్తున్నారు.


ఇంటి నుంచి భోజనం తెచ్చుకుని ఆఫీసుల్లో తీసుకునే వారిలో టైప్‌-2 మధుమేహం వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గినట్టు తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడి అయ్యింది. హోటల్, హాస్టల్ వంటి ఇతర ప్రాంతాల్లో భోజనం చేసే కంటే ఇంటి నుంచి భోజనం తెచ్చుకుని తినేవారిలో టైప్-2 మధుమేహం వచ్చే అవకాశాలు చాలామటుకు తక్కువని ఆ అధ్యయనంలో తేలింది. 
 
అంతేగాకుండా.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శరీర బరువు తగినంత ఉండేలా చూసుకోవడం, అతిగా మద్యం తీసుకోకుండా ఉండటం, ధూమపానానికి దూరంగా ఉండటం, ప్రతి రోజూ వ్యాయామం చేయడంతో మధుమేహం దూరమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే తక్కువ కేలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, బరువు తగ్గడం ద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. బరువు తగ్గితే, కాలేయం, క్లోమ గ్రంథుల్లోని కొవ్వు తగ్గిపోతుందని, ఆపై వాటి పనితీరు సాధారణ స్థితికి చేరుతుందని.. ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు.