శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (12:27 IST)

రోగాలు వద్దనుకుంటే.. ఇలా చేయాలి..?

రోగాలను దూరం చేసుకోవాలంటే.. వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలంటున్నారు... ఆరోగ్య నిపుణులు. మ‌ద్య‌పానం, ధూమ‌పానం లాంటి వాటికి దూరంగా ఉంటూ, వాటికి బ‌దులుగా యాంటీ ఆక్సిడెంట్లు అందించే తేనె, గ్రీన్‌టీ వంటి

రోగాలను దూరం చేసుకోవాలంటే.. వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలంటున్నారు... ఆరోగ్య నిపుణులు. మ‌ద్య‌పానం, ధూమ‌పానం లాంటి వాటికి దూరంగా ఉంటూ, వాటికి బ‌దులుగా యాంటీ ఆక్సిడెంట్లు అందించే తేనె, గ్రీన్‌టీ వంటి పానీయాల‌ను తీసుకోవాలి. ఎక్కువ‌గా నీరు తాగ‌డం, వేళ‌కు భోజ‌నం తిన‌డం, వ్యాయామం చేయ‌డం వ‌ల్ల కూడా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. 
 
వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంపొందించడంలో విట‌మిన్ డి కీల‌క పాత్ర పోషిస్తుంది. ఇది పాలు, చేప‌లు, మాంసం, గుడ్ల‌లో అధికంగా ఉంటుంది. ఇంకా సూర్యోదయం సమయంలో వచ్చే తొలి కిరణాల్లో పది నుంచి 15 నిమిషాలపాటు ఉంటే విటమిన్‌ డి సమృద్ధిగా అందుతుంది. ప‌ని ఒత్తిడి కార‌ణంగా నిద్ర‌కు దూర‌మ‌య్యే వారిలో వ్యాధినిరోధ‌క శ‌క్తి చాలా త‌క్కువ‌గా ఉంటుంది. 
 
అందుకే క‌నీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. ఇలా చేస్తే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎక్కువ‌గా పండ్లు, మాంసా‌హారం తీసుకోవ‌డం వ‌ల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. వీటితో పాటు ఆహారంలో పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి, మిరియాలు వంటి ప‌దార్థాలు చేర్చుకోవడం ద్వారా వ్యాధులను దరిచేరనివ్వకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.