శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 19 నవంబరు 2019 (21:32 IST)

ఇడ్లీ చేసే మేలు ఏమిటో తెలుసా?

మన చుట్టూ సూక్ష్మజీవులైన అనేక రకాలయిన బ్యాక్టీరియా వుంటుంది. మన చుట్టూనే కాదు, మన చర్మం పైన, నోట్లో, గొంతులో, మన జీర్ణవ్యవస్థ పొడవునా కోటానుకోట్ల సూక్ష్మజీవులు నివాసం వుంటాయి. ఇలా మన జీర్ణవ్యవస్థలో వుండే బ్యాక్టీరియా మన ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడటంతో పాటు కొన్ని రకాల వ్యాధుల నుంచి రక్షిస్తాయి. 
 
అంటే... పరోక్షంగా అవి మన ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇవన్నీ ప్రొబయోటిక్స్ కలిగిన పదార్థాలను తీసుకోవడం ద్వారా మేలు కలుగుతుంది. ఉదాహరణకు ఇడ్లి పిండిని రాత్రి కలుపుకుని మరుసటిరోజు ఇడ్లీ వేసుకుని తింటాం. ఈ ఇడ్లీ ద్వారా జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. మజ్జిగ కూడా అలాగే ఉపయోగపడుతుంది.