ఈ పండ్లను తింటే బలిష్టంగా తయారవుతారు (Video)

fruits
సిహెచ్| Last Updated: బుధవారం, 24 జూన్ 2020 (18:26 IST)
కరోనావైరస్ నిరోధించేందుకు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు ప్రకృతి పరంగా లభించే పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. శరీరానికి కావలసిన పోషకపదార్థాలు పండ్లు, కూరగాయల్లో ఉంటాయనడంలో సందేహం లేదు. ప్రపంచంలోని అన్ని జబ్బులకు ప్రకృతి ఇచ్చే ప్రతి పండు, కాయ, కూరగాయ ఔషధంలా పనిచేస్తుందని ఆయుర్వేదంలో చెప్పబడివుంది.

కొందరు చూసేందుకు బలహీనంగా కనబడుతుంటారు. అలాంటి వారు డ్రైఫ్రూట్స్, గోధుమలు, సజ్జల ద్వారా తయారు చేసిన రసం, అన్ని రకాల పండ్ల రసాలను ఆహారంగా తీసుకుంటే శరీర బరువు పెరిగి ఆరోగ్యంగా తయారవుతారు. అలాగే క్యారెట్, క్యాబేజీ, దోసకాయ, కలకండ, యాపిల్, పైనాపిల్ పండ్ల నుంచి తీసిన రసాలను సేవిస్తుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఎసిడిటీతో బాధపడేవారు ప్రతి రోజు మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్ళల్లో నిమ్మకాయ రసం, అరచెంచా కలకండ కలుపుకుని సేవించాలి. ఉసిరికాయ చూర్ణం ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా సేవించాలి. రెండుపూటలా మీరు తీసుకునే ఆహరం వేళల్లో ఖచ్చితమైన సమయాన్ని పాటించాలి. శారీరక ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రాణాయామం, ధ్యానం చేస్తుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.

దీనిపై మరింత చదవండి :