ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 11 జూన్ 2022 (16:48 IST)

పుచ్చకాయ తినడం చెడ్డది కాదు కానీ అధికంగా తింటే మాత్రం... (video)

దాహార్తిని తీర్చుకోవడానికి చాలామంది పుచ్చకాయలు తింటుంటారు. ఐతే పుచ్చకాయలను మోతాదుకి మించి తీసుకుంటే శరీరంలో నీటి స్థాయి పెరుగుతుంది. అలా చేరిపోయిన అదనపు నీరు విసర్జించబడకపోతే, అది రక్తం పరిమాణంలో పెరుగుదలకు దారితీస్తుంది.


ఫలితంగా కాళ్ళలో వాపు, అలసట, మూత్రపిండాలు బలహీనం కావడం... తదితర సమస్యలకు కారణమవుతుంది. అంతేకాదు శరీరంలో సోడియం స్థాయిలను కోల్పోవడానికి కూడా ఇది దారితీయవచ్చు.

 
100 గ్రాముల పుచ్చకాయలో దాదాపు 30 కేలరీలు ఉంటాయి. ఇందులో నీరు ఎక్కువగా ఉండటంతో, 500 గ్రాములు.. అంటే అరకేజీ వరకూ తీసుకోవచ్చు. అంటే దీని ద్వారా 150 కేలరీలు శరీరంలోకి వచ్చేస్తాయి. అలాగే, ఇందులో 100 గ్రాములకు ఆరు గ్రాముల చక్కెర ఉంటుంది. కాబట్టి పుచ్చకాయలో అర్థకేజీకి 30 గ్రాముల చక్కెర ఉంటుంది.

 
పుచ్చకాయ తినడం చెడ్డది కాదు కానీ అధికంగా తినడం అనారోగ్యకరమైనది. అందువల్ల తగిన మోతాదులో మాత్రమే ఏ పండైనా తినాలని వైద్య నిపుణులు చెపుతున్నారు.