శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 10 జూన్ 2022 (22:30 IST)

ఆరోగ్యానికి కావాలి ఓ సలాడ్

ఆరోగ్యకరమైన పదార్థాలలో సలాడ్ అనేది కూడా ఒకటి. కొంతమంది ఆహారానికి బదులుగా సలాడ్ మాత్రమే ఇష్టపడతారు. ఇవి వివిధ రకాలు- వెజిటబుల్ సలాడ్, పాస్తా సలాడ్, ఫ్రూట్ సలాడ్. ఇవి శరీరానికి చాలా ప్రయోజనాలను ఇస్తాయి. రోజూ తాజా సలాడ్ తినడం వల్ల జీర్ణశక్తి బాగా ఉంటుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. ఇప్పుడు వివిధ సలాడ్‌లు, వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం

 
కూరగాయల సలాడ్‌లలో పచ్చి ఆకు కూరలతో పాటు దోసకాయ, ముల్లంగి, క్యారెట్, టమోటా, ఉల్లిపాయలు వేస్తారు. ఇది కాకుండా, ఉడికించిన గుడ్లు, జున్ను కూడా ఉంచవచ్చు. వేసవిలో దీని వినియోగం అలసటను తొలగిస్తుంది.

 
పండ్ల ముక్కల సలాడ్, ఇది వివిధ కాలానుగుణ పండ్ల నుండి తయారవుతుంది. శరీరానికి అనేక ప్రయోజనాలను తెచ్చే అనేక పోషకాలను కలిగి ఉంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసే సలాడ్‌ని డెజర్ట్ సలాడ్ అంటారు. లిచీ, స్ట్రాబెర్రీ, ఖర్జూరాలను కూడా ఇందులో చేర్చవచ్చు. ఏదైనా తీపి తినాలని అనిపించినప్పుడల్లా, వీటిని తినవచ్చు. దీని వల్ల నోరు కూడా తీపిగా మారుతుంది. ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు.

 
సలాడ్‌లో చాలా ఫైబర్‌ ఉంటుంది. శరీరంలో ఫైబర్ అవసరమైనవారికి ఇది మంచి ఆహారం. కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. ఇది గుండెకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. సలాడ్ వల్ల శరీరం అలసట తొలగిపోయి ఎంతో శక్తి లభిస్తుంది. వేసవిలో ఎక్కువగా సలాడ్ తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరత చాలావరకు భర్తీ అవుతుంది.
 
సలాడ్ తినడం ద్వారా, శరీరానికి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహకరిస్తాయి. కొంతమందికి ఆకలి చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వారు తప్పనిసరిగా సలాడ్ తినాలి, దీని కారణంగా ఆకలి పెరుగుతుంది.