1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 8 జూన్ 2022 (22:31 IST)

ఇలాంటి వారు పాలు తాగరాదు, తాగితే ఏమవుతుందో తెలుసా?

Milk
పాలలో కాల్షియం, విటమిన్లు ఎ, బి12 అలాగే థైమిస్, నికోటినిక్ యాసిడ్ వంటి అనేక మూలకాలు ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు పాలు సంపూర్ణ ఆహారంగా పరిగణించబడటానికి ఇదే కారణం. రోజూ పాలు తాగడం ద్వారా శరీరానికి శక్తి లభిస్తుంది. అయితే పాల వినియోగం కొంతమందికి హానికరం. కాబట్టి ఎలాంటివారు పాలు తాగకూడదో తెలుసుకుందాం.

 
కొందరికి పాలు తీసుకోవడం వల్ల అలర్జీ వస్తుంది. దీనికి కారణం లాక్టోస్. ఈవిధంగా రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా చర్మంపై ఎర్రటి దద్దురుతో శరీరంలో వాపు కూడా ఉండవచ్చు. మీకు ఏదైనా అలర్జీ సమస్య ఉంటే పాలు తీసుకోరాదు.

 
ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు పాలు తాగకూడదు. అలాంటి వారికి పాలు తేలికగా జీర్ణం కావు. ఫ్యాటీ లివర్‌తో బాధపడేవారు చాలా తక్కువ పరిమాణంలో ప్రోటీన్ తీసుకోవాలి. పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో పాలు తాగడం వల్ల అజీర్ణం, ఎసిడిటి, గ్యాస్, నీరసం, అలసట, బరువు పెరగడం లేదా తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.

 
పాలలో లాక్టోస్ ఉంటుంది, ఇది కొన్నిసార్లు జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. దీని కారణంగా ఎక్కువ పాలు తాగడం వల్ల కొంతమందిలో కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ ఏర్పడుతుంది. గ్యాస్ సమస్య ఉన్నవారు పాలను తీసుకోకుండా ఉండాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.