శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (17:37 IST)

పొట్టలో కాస్త తేడాగా వుందా..? మజ్జిగలో కాసిన్ని మెంతుల్ని?

అసలే వేసవి కాలం. వేడి కారణంగా జ్యూస్‌లు, ఐస్ క్రీమ్‌లు తీసుకుంటూ వుంటాం. ఇంకా కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయ్యేవారు ఒక ముద్దు కాస్త ఎక్కువగా లాగిస్తే.. పొట్టలో కాస్త తేడా ఏర్పడి.. ఇబ్బంది కలుగుతుంది. అలాంటి వారు.. మజ్జిగలో కాసిన్ని మెంతులు వేసుకుని వెంటనే తాగేయాలి. మెంతులు శరీర వేడిని తగ్గిస్తుంది. అజీర్తి సమస్యలను తొలగిస్తుంది. జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. 
 
శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఎంతగానో తోడ్పడే మెంతులను నేరుగా నోట్లో వేసుకుని నీళ్లు తాగవచ్చు. లేదంటే రాత్రిపూట గ్లాసు నీటిలో చెంచా మెంతులు నానబెట్టి ఉదయాన్నే తాగినా ఫలితం ఉంటుంది. నెలసరి సమయంలో కొందరు మహిళలు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు గోరువెచ్చని నీటిలో మెంతులు వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. 
 
ఇకపోతే.. బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి మెంతులు తోడ్పడతాయి. అలాగే మధుమేహాన్ని మెంతులు నియంత్రిస్తాయి. కీళ్ల నొప్పులను తగ్గించడానికి సాయపడతాయి. కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.