గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By జె
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (18:39 IST)

వేసవితో దాహం తీరడానికి, యూరిన్ సమస్యలకు చెక్ పెట్టే ఒకే కాయ (Video)

వేసవి అదరగొడుతోంది. 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఇంట్లో ఉంటే ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. అయితే వేసవి కాలంలో దాహం తీరడానికి ఎర్రగా, చల్లగా ఉండే పుచ్చకాయలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
 
పుచ్చకాయలో ఉండేది ఎక్కువభాగం నీరే. అతి దాహాన్ని తీరుస్తుంది. యూరిన్ సమస్యలున్న వాళ్ళు తింటే మూత్రకోశంలో చిన్న రాళ్ళు ఉన్నా కరిగిస్తుందట. పుచ్చకాయ రసంలో తేనె కలుపుకుని తీసుకుంటే గుండె జబ్బులు తగ్గుతాయట. 
 
ఎండ తాపం తగ్గాలన్నా, చమట ద్వారా పోయే ఖనిజ లవణాల లోపం తగ్గాలన్నా పుచ్చకాయ తినాలట. ఏ రకం జ్వరం వచ్చిన వారైనా సరే పుచ్చకాయ రసంలో తేనె కలుపుకుని తింటే నీరసం తగ్గుతుందట. శరీరానికి శక్తి కూడా వస్తుందట. మలబద్ధకం ఉన్న వారు వేసవిలో ఈ కాయ తినడం మంచిదట.
 
ఒక గ్లాసు పుచ్చకాయ రసంలో కొంచెం మజ్జిగ, ఉప్పు కలిపి తాగితే నోరు ఎండిపోదట. అతి దాహం ఉండదట. వేసవిలో యూరిన్ పాస్ చేసేటప్పుడు వచ్చే మంట తగ్గుతాయట. శరీరంలో ఉండే వేడి తగ్గి చలువ చేస్తుందట.
 
పుచ్చకాయలో బి,సి, విటమిన్లు లభిస్తాయట. సియాసిస్ వంటి బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయట. ఎండవేళ బయటకు వెళ్ళినప్పుడు పుచ్చకాయ ముక్కలు తింటే వడదెబ్బ తగలదట. శరీరంలో వేడిని చాలా వరకు తగ్గిస్తుందట. మూత్రపిండాలకు మంచిది. జీర్ణకోశాన్ని మెరుగుపరిచే శక్తి పుచ్చకాయకు ఉందట.