సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఆర్. సందీప్
Last Modified: శనివారం, 23 మే 2020 (16:25 IST)

పొట్లకాయను మగవారు తీసుకుంటే ఏమవుతుంది?

శృంగారంలో పాల్గొనడం వల్ల శరీరంలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి రిలాక్సేషన్, మనశ్శాంతి, ఆరోగ్యం అందిస్తాయి. లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి పొట్లకాయ చాలా వరకు దోహదపడుతుంది. చాలా తక్కువ మంది దీనిని తింటుంటారు, అయితే ఇందులోని ప్రత్యేక గుణాలు చాలా అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.
 
పొట్లకాయ తినడం వల్ల లైంగిక సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆయాసం, ఉబ్బసం ఉన్నవారు పొట్లకాయ ఎక్కువగా తినడం వలన సమస్య దూరం అవుతుంది, శరీరానికి చలువ చేస్తుంది. పొట్లకాయని రెగ్యులర్‌గా తిన్నవారిపై చేసిన పరిశోధనలో లైంగిక సమస్యలు దూరమైనట్లు తేలింది. 
 
పిల్లలకు పొట్లకాయను తినిపించడం వల్ల నులిపురుగులు పోయి కడుపు శుభ్రం అవుతుంది. ఇదే కూరగాయ జాతికి చెందిన సొరకాయ కూడా లైంగిక సమస్యలకు చక్కని పరిష్కారం. వీటిని తినడం వల్ల పురుషులలో వీర్య వృద్ధి, లైంగిక శక్తి పెరుగుతాయి. ముదురు సొరకాయ గింజలను వేయించి ఉప్పు, ధనియాలు, జీలకర్ర వేసి పొడి చేసి ఆహారంతోపాటు తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇవే కాకుండా పాలకూర, గ్రీన్ టీ, నట్స్, వెల్లుల్లి, అల్లం, దానిమ్మ, పుచ్చకాయ, ఫ్యాటీ ఫిష్ ఇలాంటివన్నీ రెగ్యులర్‌గా తీసుకోవాలి.