సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By జె
Last Modified: బుధవారం, 27 మే 2020 (19:46 IST)

ఎండాకాలంలో వడదెబ్బ తగలకూడదంటే ఈ పండు తింటే?

దానిమ్మ పండులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఇంకా మేలు చేకూర్చే పోషకాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ రసం గుండె, కాలేయం, మూత్రపిండాలకు మంచిదట. వడదెబ్బ వల్ల వచ్చే జ్వరాలను పూర్తిగా తగ్గించడానికి ఎంతో దోహదం చేస్తుందట.
 
దాహాన్ని అణచి తాపాన్ని పోగొడుతుందట. వేసవిలో శరీరం వేడి అనిపించినప్పుడు దానిమ్మ పండు గుజ్జును పైపూతగా వేసుకుంటే ప్రయోజనం వుంటుందట. అందుకే ఎండాకాలంలో దానిమ్మను ప్రతిరోజు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. జ్యూస్‌గా తాగడం కన్నా దానిమ్మను అలాగే తింటే ఇంకా మంచిదంటున్నారు. ఒకవేళ జ్యూస్ తాగినా ఐస్ తక్కువగాను, చక్కెర కూడా తక్కువగాను కలుపుకుని తాగాలట.