గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 జనవరి 2018 (11:07 IST)

బంతిపూలతో డెంగ్యూ - చికెన్ గున్యాలకు చెక్

డెంగ్యూ, మలేరియా, గున్యా, వంటి వ్యాధులు వెంటాడుతున్నాయా? అయితే మీ ఇంటి ఆవరణలో బంతిపూల మొక్కలు పెంచితే ఈ వ్యాధి కారక దోమలు దరిచేరవట. ప్రస్తుతం ఈ విషయంపై బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) లోతుగా అధ్యయనం చేస్

డెంగ్యూ, మలేరియా, గున్యా, వంటి వ్యాధులు వెంటాడుతున్నాయా? అయితే మీ ఇంటి ఆవరణలో బంతిపూల మొక్కలు పెంచితే ఈ వ్యాధి కారక దోమలు దరిచేరవట. ప్రస్తుతం ఈ విషయంపై బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) లోతుగా అధ్యయనం చేస్తుంది. 
 
దోమల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటి నియంత్రణకు కొత్త మార్గాలను అన్వేషించాలని డీబీటీకి శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ, పర్యావరణం, అటవీ సంబంధింత అంశాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. 
 
ముఖ్యంగా ఆడ దోమలను అడ్డుకునే కొత్త పరిజ్ఞానంపై దృష్టి సారించాలని తెలిపింది. దీంతో ఔషధ, వైద్య గుణాలున్న మొక్కలపై తాము ఇప్పటికే అధ్యయనం చేపడుతున్నట్లు డీబీటీ తెలిపింది.