శనివారం, 16 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 14 మే 2022 (20:35 IST)

ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే అలవాట్లు, ఇలా బయటపడొచ్చు

ghee
కొవ్వు పదార్థాలు ఎక్కువగా భుజించేవారికి, రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారికి, అధిక బరువుతో వున్నవారికి, రక్తపోటు, షుగర్ వ్యాధి, గుండెజబ్బులున్నవారికి, ధూమపానం చేసేవారికి రక్తనాళాలు గట్టిపడే ప్రమాద పరిస్థితులు తలెత్తే అవకాశం వుంటుంది.

 
ఇలాంటి వాటి నుంచి బయటపడేందుకు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మనం తినే ఆహారం సమతులమైనదిగా వుండాలి. కనుక వీటిని పూర్తిగా నిషేధించనవసరంలేదు. సంతృప్తకొవ్వులు, కొలెస్ట్రాల్ ఏ ఆహారంలో ఎక్కువగా వుంటాయో వాటిని దూరంగా వుంచాలి. తక్కువగా వున్న పదార్థాలను భుజించి పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి. పత్తినూనె, పొద్దుతిరుగుడు నూనె, సోయానూనె వాడటం మంచిది. వెన్న, నెయ్యి, కొవ్వులు ఎక్కువున్న నూనెలు వాడకూడదు.

 
మాంసాహారం తినే అలవాటున్నవారు కోడిమాంసం, కొవ్వు తక్కువగా వున్న చేపలు భుజిస్తుండాలి. పశుమాంసం, పంది మాంసం భుజించడం మానేయాలి. పాల పైన మీగడ తొలగించి తీసుకోవాలి. అలాగే పొట్ట నిండినా రుచిగా వుందని మరింత తినేయకూడదు. క్రమబద్ధమైన వ్యాయామం, నడక ఆరోగ్యానికి చాలా మంచిది.