మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 11 జనవరి 2019 (18:01 IST)

చక్కని నిద్రకు ఏం చేయాలి...?

నిద్రరావట్లేదా.. అయితే ఏం చేయాలో తెలుసుకుందాం రండీ. గ్లాస్ గోరువెచ్చని పాలు తాగితే చాలంటున్నారు. ఏదైనా పుస్తకం చదవాలనుకొన్నప్పుడూ పూర్తిగా కూర్చొని చదవకుండా పడుకొని చదవితే కాస్తా రిలాక్స్ అవుతారు. నిద్ర త్వరగా పడుతుంది. అలాగే నిద్రించే ముందు మంచి సువాసన కలిగిన సోప్స్ లేదా షాంపులు, లోషన్‌ను‌‍తో స్నానం చేయడం వలన మనస్సు ఫ్రెష్‌గా ప్రశాంతంగా ఉంటుంది. దాంతో నిద్రబాగా పడుతుంది. 
 
ఇక బాగా నిద్రపట్టాలంటే కాఫీ తీసుకోరాదు. కాఫీలో ఉండే కెఫిన్ నిద్రపట్టకుండా చేస్తుంది. కాబట్టి ప్రశాంతంగా నిద్రపోవాలనుకునే వారు కాఫీని రాత్రి సమయంలో నివారించాలి. అలానే ఏపాటి చిన్న శబ్దం, వెలుతురు ఉన్నా నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి, బెడ్ మీదకు వెళ్ళడానికి ముందు ఇటువంటివి లేకుండా చూసుకోవాలి. డిమ్ లైట్స్, సెంటెడ్ క్యాండిల్స్, తక్కువ వాయిస్‌తో సాఫ్ట్ మ్యూజిక్, కాఫీ షీట్స్ వంటివాటిని అరేంజ్ చేసుకోవడం వల్ల ప్రశాతంమైన నిద్రను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.