శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 6 మే 2019 (12:23 IST)

రొయ్యలు తింటే చాలు.. అవన్నీ హుష్ కాకి..

అవును రొయ్యల్ని తింటే చాలు అధిక బరువు ఇట్టే తగ్గిపోతారు. అధికబరువుని తగ్గించడంలో రొయ్యలు బాగా పనిచేస్తాయి. రొయ్యల్లోని ప్రోటీన్స్ కండరాల నిర్మాణానికి, కొత్త కణజాలం ఏర్పాటుకు ఉపయోగపడతాయి. హార్మోన్ల సమస్యలు ఉన్నవారు.. రొయ్యలు తింటుంటే జీవక్రియలు మెరుగ్గా జరుగుతాయి. రక్తహీనతను రొయ్యలు దూరం చేస్తాయి. 
 
అంతేగాకుండా గుండె సంబంధిత రుగ్మతలను రొయ్యలు దూరం చేస్తాయి. వారానికి ఓసారైనా ఆహారంలో రొయ్యల్ని భాగం చేస్తే.. హృద్రోగాలను దూరం చేసుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. రొయ్యల్లో ఎక్కువగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని వారు చెప్తున్నారు. 
 
రొయ్యల్లోని క్యాల్షియం, విటమిన్-ఇ చర్మ ఆరోగ్యానికి, దంతాలకు, ఎముకలకు బలాన్నిస్తాయి. పిల్లల ఆరోగ్యానికి తగిన ప్రోటీన్లను రొయ్యలు సమకూరుస్తాయి. అందుచేత వారానికి ఓసారైనా రొయ్యల్ని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి మేలు చేసినవారమవుతాం.