గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (13:30 IST)

మామిడి ఆకులతో మధుమేహం పరార్.. ఇవి తెలిస్తే?

మామిడి ఆకులు రక్తనాళాలను బలపరిచి రక్తపోటును నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. మామిడి ఆకుల టీ తయారుచేసుకుని తాగిన, మామిడాకులను మరిగించి ఆ నీటితో స్నానం చేసిన ఒత్తిడి కూడా తగ్గుతుంది. 
 
మామిడి ఆకులలో ఉండే యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. మామిడి ఆకులలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి, ఫ్లేవనాయిడ్లు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 
 
మామిడి ఆకుల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు జుట్టుకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. మామిడి ఆకులతో టీ, ఆకులను మరిగిస్తే వచ్చే రసం, ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకుని కూడా వాడుకోవచ్చు. 
 
లేత మామిడి ఆకులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు లేత మామిడి ఆకులను నమిలి తిన్నా, లేదా మామిడి ఆకులను మరిగించి కషాయంలా తీసుకున్న మధుమేహం అదుపులో ఉంటుంది.