ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?  
                                       
                  
                  				  ప్రతి రోజూ గుప్పెడు బాదం పప్పులను తినడం వల్ల ఫిట్‌గా, అందంగా కనిపిస్తారు. రోజూ బాదంపప్పు తినడం వల్ల చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చర్మం మెరుపును పెంచుతుంది. బాదం పప్పుతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము.
				  											
																													
									  
	 
	బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి.
	10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది.
				  
	నియాసిన్, కాల్షియం, ఫైబర్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం,  జింక్ బాదంలో వున్నాయి.
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.
	బాదంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి వృద్ధాప్యాన్ని నియంత్రిస్తాయి.
				  																		
											
									  
	రక్తంలో ఆల్ఫా టోకోఫెరోల్ మొత్తాన్ని బాదం పెంచుతుంది, ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.
	నానబెట్టిన బాదం మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
				  																	
									  
	ఆహార నిపుణుల సూచన ప్రకారం రోజుకు 8 నుంచి 10 బాదం పప్పులు తింటే చాలు