నలుపు ద్రాక్షల్లోని గింజలు ఎంత మేలు చేస్తాయంటే?
నలుపు ద్రాక్షల్లోని గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా.. అయితే ఈ కథనం చదవండి. ద్రాక్షల్లో ప్రో-యాంటో సయాటిన్ అనే పోషకం వుంటుంది. ఈ ప్రో ఆంటో సయాటినిన్ ద్రాక్షల్లో వుంటాయి. అయితే నలుపు ద్రాక్షల్లోని గింజల్లోనే ఈ ధాతువు పుష్కలంగా వుంటుంది. అందుకే నలుపు ద్రాక్ష గింజలను నమిలి తినడం ద్వారా ఆ పోషకాన్ని మనం శరీరానికి అందించినట్లు అవుతుంది.
నలుపు ద్రాక్ష గింజల రసాన్ని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఈ వంటి పోషకాలు లభిస్తాయి. విటమిన్-ఇ అనేది ద్రాక్ష గింజల్లో 50 శాతం వుంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. రక్తనాళాల్లోని మలినాలను తొలగిస్తుంది. రక్తనాళాల్లో వాపును నియంత్రిసుంది.
పైల్స్ వ్యాధికి దివ్యౌషధందా పనిచేస్తుంది. రక్తనాళాల్లో వుండే కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఎంతో మేలు చేస్తుంది. కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. రేచీకటిని తరిమికొడుతుంది. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ రుగ్మతలకు చెక్ పెడుతుంది. పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ఇది చెక్ పెడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.