ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 17 డిశెంబరు 2017 (10:27 IST)

ఆరెంజ్ జ్యూస్‌ను పరగడుపున తాగితే బరువు తగ్గొచ్చు..

నారింజ పండు ఆరోగ్యానికి.. అందానికి మేలు చేస్తుంది. ఈ పండు శరీరానికి బలాన్నిస్తుంది. నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, కాపర్‌ వంటి ధాతువులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జ్వరం తగిలినప్పుడు,

నారింజ పండు ఆరోగ్యానికి.. అందానికి మేలు చేస్తుంది. ఈ పండు శరీరానికి బలాన్నిస్తుంది. నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, కాపర్‌ వంటి ధాతువులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జ్వరం తగిలినప్పుడు, జీర్ణశక్తి తగ్గినప్పుడు నారింజ తింటే ఉపశమనం లభిస్తుంది. ఆరెంజ్‌లోని బెటా కెరోటిన్‌ యాంటీ ఆక్సిడెంట్‌ శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 
నారింజలో వున్న కాల్షియం.. ఎముకలకు మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలోనూ సహాయపడుతుంది. దీనివల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. జలుబు, దగ్గు లాంటి ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరవు. రోజూ పరగడుపున ఒక గ్లాస్‌ నారింజ జ్యూస్‌ తాగితే బరువు తగ్గొచ్చు.
 
ఇక సౌందర్యానికి కూడా ఆరంజ్ మేలు చేస్తుంది. ముఖంపై ఏర్పడే మొటిమలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేయడంలో కమలా రసం బాగా ఉపయోగపడుతుంది. తరచూ జలుబుతో బాధపడేవారిలో ఇది రోగనిరోధక శక్తి పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.