శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 17 నవంబరు 2023 (14:38 IST)

ప్యూర్ డ్రింకింగ్ వాటర్ పవర్‌ఫుల్ బెనిఫిట్స్

drinking water
మంచినీరు. రోజుకి కనీసం 2 నుంచి 3 లీటర్ల మంచినీరు తాగాలని నిపుణులు చెపుతారు. ఐతే ఆ నీరు స్వచ్ఛమైనదిగా వుండాలి. స్వచ్ఛమైన మంచినీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నీరు త్రాగడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది శరీర జీవక్రియ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
 
మానవ శరీరంలో మూడింట రెండు వంతుల నీరు ఉంటుంది కనుక డీహైడ్రేషన్ మన శక్తిస్థాయిలను ప్రభావితం చేస్తుంది. స్వచ్ఛమైన నీటిని తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. నీరు శరీరంలో శోషరసాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.
 
తగినంత నీరు తాగడం వల్ల ముఖంపై ఉండే ముడతలు తగ్గి కాంతివంతమవుతుంది. స్వచ్ఛమైన నీటిని తాగడం వల్ల మూత్రపిండాలు సమర్థవంతంగా పని చేస్తాయి. మంచినీరు కీళ్ళకు ఎటువంటి నష్టం జరగకుండా కాపాడుతుంది. మన ఎముక మృదులాస్థిలో 80 శాతం నీరు ఉంటుంది.