సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: సోమవారం, 19 మార్చి 2018 (21:08 IST)

భార్యాభర్తల మధ్య శృంగారం తరచూ అవసరమా?

భార్యాభర్తల మధ్య తరచూ శృంగారం అవసరమా... అంటే అవుననే చెబుతున్నారు ప్రముఖ నిపుణులైన మైఖేల్ వెయనర్ డేవిస్. దీనివల్ల భార్యాభర్తలు ఆనందంగా ఉండటమే కాదు, ఆరోగ్యంగానూ ఉంటారట. వాళ్ల మధ్య గాఢమైన బంధం అల్లుకుంటుంది. బాధ్యత పెరుగుతుంది. ఇద్దరిలో ఆత్మవిశ్వాసం పెర

భార్యాభర్తల మధ్య తరచూ శృంగారం అవసరమా... అంటే అవుననే చెబుతున్నారు ప్రముఖ నిపుణులైన మైఖేల్ వెయనర్ డేవిస్. దీనివల్ల భార్యాభర్తలు ఆనందంగా ఉండటమే కాదు, ఆరోగ్యంగానూ ఉంటారట. వాళ్ల మధ్య గాఢమైన బంధం అల్లుకుంటుంది. బాధ్యత పెరుగుతుంది. ఇద్దరిలో ఆత్మవిశ్వాసం పెరిగి, ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఒత్తిడికీ, అలసటకీ కారణమయ్యే కార్టిసాల్ లాంటి హార్మోన్ల స్రావం తగ్గి, ప్రశాంతంగా ఉంటారు.
 
భార్యాభర్తలలో చిన్నచిన్న మనస్పర్థలు వచ్చినా వెంటనే సర్దుకుపోతుంటారట. డిప్రెషన్, ఆందోళన దరిచేరవు. శృంగారం వల్ల విడుదలయ్యే ఎండార్పిన్లు ఆనందంగా ఉండేలా చేస్తాయి. దాంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. హృద్రోగాలని, ఇన్పెక్షన్లని, బీపీని జీర్ణాశయ సమస్యలనీ, ప్రొస్టేట్ క్యాన్సర్‌ని నిరోధిస్తుంది.
 
మనస్పూర్తిగా శృంగారంలో పాల్గొనే భార్యాభర్తల్లో ఒకరిమీద ఒకరికి అంతులేని ప్రేమ ఉంటుందట. మానసికమైన ఒత్తిడిని తగ్గించడమే కాక మంచి నిద్ర పట్టేలా చేస్తుందనీ, మూత్రాశయ సమస్యల్నీ నిరోధిస్తుందనీ నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.