సోమవారం, 18 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 8 జులై 2022 (17:53 IST)

shinzo abe: జపాన్ మాజీ ప్రధానికి అలా జరగకుండా వున్నట్లయితే బ్రతికిబయటపడేవారు

shinzo abe
myocardial infarction... గుండె కండరాలకు రక్త ప్రసరణకు ఆటంకం, జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబెపై దుండగుడు వెనుక నుంచి కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అపస్మారకంలోకి వెళ్లిపోయారు. దీనితో హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు.


ఐతే ఆయన myocardial infarctionకి గురయ్యారనీ, చికిత్సకు స్పందించడంలేదని వైద్యులు తెలిపారు. అసలు myocardial infarction అంటే ఏమిటి? myocardial infarction... గుండె కండరాలకు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడటం. రక్త ప్రసరణకు ఆటంకం కలగకుండా శరీరంలో తూటా వున్నప్పటికీ బ్రతికే ఛాన్స్ వుంటుంది. కానీ జపాన్ ప్రధాని విషయంలో అది జరగలేదు. ఫలితంగా మరణం సంభవించింది.
 

గుండెపోటు సమస్య అనేది వైద్యపరమైన అత్యవసర పరిస్థితి. సాధారణంగా రక్తం గడ్డకట్టడం వల్ల గుండెకు రక్తప్రసరణ ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. రక్తం లేకుండా, కణజాలం ఆక్సిజన్ కోల్పోతుంది, చనిపోతుంది. ఛాతీ, మెడ, వీపు లేదా చేతుల్లో బిగుతు లేదా నొప్పి, అలాగే అలసట, తలతిరగడం, అసాధారణ హృదయ స్పందన, ఆందోళన వంటి లక్షణాలు ఉంటాయి. పురుషుల కంటే స్త్రీలు విలక్షణమైన లక్షణాలను కలిగి ఉంటారు.

 
జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా వుంచుకోవచ్చు. అలాగే మందులు, స్టెంట్‌లు, బైపాస్ సర్జరీ వంటివి గుండె సమస్యల విషయంలో అనుసరించాల్సి వుంటుంది.