మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 నవంబరు 2022 (14:58 IST)

చికెన్ ఉడికించి.. కర్రీ తీసుకుంటే సరి.. తండూరీ తింటే క్యాన్సర్..?

Tandoori chicken
Tandoori chicken
చికెన్ ఉడికించి.. కర్రీ తీసుకుంటే సరిపోతుంది. కానీ తండూరి చికెన్‌లా నిప్పులపై కాల్చుకుని తింటే మాత్రం క్యాన్సర్ వస్తుంది. ఇలాంటి మాంసాన్ని ఎక్కువ తీసుకుంటే ప్రాణాల మీదకు వస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. స్టీక్ మీట్ తింటే పాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదముందని వెల్లడి అయ్యింది. 
 
బాగా కాల్చిన చికెన్‌ను ఎక్కువగా తినేవారు, తినని వారిపై అమెరికాలోని మిన్నెసోటా విశ్వవిద్యాలయం సర్వే చేసింది. ఈ సర్వేలో మాంసాన్ని నేరుగా మంట మీద పెట్టి కాల్చడం వల్ల దాని పైపొర మీద క్యాన్సర్ సమ్మేళనాలు ఏర్పడే ప్రమాదం ఉందని తేలింది. 
 
దాని ప్రకారం.. కాల్చిన మాంసం తినని వారితో పోల్చితే, తినే వారిలో 60 శాతం ఎక్కువ మందికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. 
 
అంతేకాదు మాంసం మంటపై కాలుతున్నప్పుడు వాటి కొవ్వు నిప్పుల మీద పడి.. పాలీసైక్లిక్ ఆరోమెటిక్ హైడ్రోకార్బన్‌కి దారితీస్తుంది. ఇది మన ఆరోగ్యానికి అత్యంత హానికరమని నిపుణులు వెల్లడించారు.