సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 2 డిశెంబరు 2019 (22:06 IST)

కేశాల పెరుగుదల కోసం ఆ మందులు వాడితే?

జుట్టు పెరుగుదల కోసం ఉపయోగించే మందు పురుషుల వంశాభివృద్ధిని అంతమొందించే ప్రభావాన్ని కలిగి ఉందనే విస్మయం కలిగించే రిపోర్ట్ వెలువడింది. జుట్టు విషయంలో స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా దిగులు ఎక్కువే. దిగులు, మానసిక ఒత్తిడి, రసాయన మిశ్రమాలతో కూడిన షాంపూలు - సబ్బులు ఉపయోగించడం మొదలైన కారణాలవల్ల ఈరోజు చాలా మంది యువకుల జుట్టు రాలిపోయి బట్టతలలుగా మారుతున్నాయి. 
 
అమ్మాయికి నచ్చకపోతే ఏంచేయాలి అనే దిగులుతో ఎంతోమంది యువకులు సతమతమౌతున్నారు. అందువల్ల జుట్టు రాలకుండా కాపాడుకునేందుకు, జుట్టు ఒత్తుగా పెరిగేందుకు రసాయన మిశ్రమాలతో కూడిన నూనెలనో, క్రీములనో ఉపయోగిస్తున్నారు. కొంతమంది టాబ్లెట్స్‌ని కూడా ఉపయోగిస్తున్నారు. అందాన్ని పెంచుకునేందుకు వారు వాడే ఆ మందులలోనే ప్రమాదం దాగి ఉందనే విషయంచాలా మందికి తెలీదు. అమెరికాలోనూ, ఫ్రాన్స్ దేశంలోనూ జుట్టు పెరుగుదల కోసం ఉపయోగించిన కొన్ని మందులు పురుషులలో నపుంసకత్వాన్ని కలిగించిందని కనుగొనబడింది.