శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2019 (18:37 IST)

ఆడపిల్లపై చేయి వేస్తే అలా చేయాలన్న రోజా (Video)

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై మహిళా సంఘాలు కదం తొక్కాయి. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటాయి. ప్రియాంకారెడ్డిని హత్య చేసిన నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు మహిళా సంఘాలు.
 
అయితే చిత్తూరు జిల్లా నగరిలో పర్యటిస్తున్న రోజా ప్రియాంకారెడ్డి హత్యపై తీవ్రంగా స్పందించారు. ఆడపిల్లలపై చేయి వేస్తే వారిని నడిరోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేశారు. జనం ముందే ఇలాంటి శిక్షలు వేస్తే మరోసారి ఇలాంటి ఘటనలు పునరావ్రుతం కాకుండా ఉంటుందన్నారు. 
 
కామాంధులకు దుబాయ్ లో వేసే శిక్షలను మనదేశంలో కూడా అమలు చేయాలన్నారు. ప్రియాంక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు రోజా.