శనివారం, 4 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (17:55 IST)

వీర్యవృద్ధికి టమాటా దివ్యౌషధం.. టమాటా రసాన్ని తాగితే?

వీర్యవృద్ధికి టమాటా దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. టమాటాల్లో సహజ సిద్ధంగా ఉండే లైకోపీన్ అనే సమ్మేళనం వీర్యవృద్ధిని విశేషంగా పెంచుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అలాగే మహిళలు మెనోపాజ్‌ దశలో ఉన్న వారు రోజు రెండు గ్లాసుల టమాటా రసాన్ని తాగడం వల్ల ఎముకలు అరిగి, విరిగిపోయే సమస్యకి స్వస్తి చెప్పవచ్చు. 
 
టమాటాల్లోని లైకోపీన్‌ వల్ల ఎముకలు బలంగా మారతాయని అధ్యయనంలో తేలింది. టమాటాల్లో గుండెకు మేలు చేసే పొటాషియం, రక్తంలో గ్లూకోజు స్థాయులను నియంత్రించే మాంగనీసులాంటివి కూడా పుష్కలంగా ఉన్నాయట. ప్రతిరోజూ తినే ఆహారంలో టమాటా తీసుకుంటే... బరువు తగ్గుతారని వైద్యులు చెప్తున్నారు. టమోటాలు తినే వారు ఇతర ఆహార పదార్ధాలను ఎక్కువగా తినలేరు.
 
టమోటాల్లో విటమిన్ ఏ అధికంగా ఉండటంతో కంటి జబ్బులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. టమోటాని చక్రాలుగా తరికి కళ్ళ మీద పెట్టుకున్నా కళ్ళకి చల్లదనం లభిస్తుంది. వీటిల్లోని విటమిన్‌ ఏ, విటమిన్‌ సి రోగ నిరోధకశక్తినీ పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించటంలో తోడ్పడతాయి. వీటికి ఎర్రటి రంగును తెచ్చిపెట్టే లైకొపేన్‌ మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ల వృద్ధిని అడ్డుకోవటంలో సాయం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.