గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 12 ఆగస్టు 2019 (21:29 IST)

ఆ కాయలు తింటే ఉపయోగాలు ఏమిటో తెలుసా?

వయసు దాటిపోయినప్పటికీ కొందరు ఎత్తు పెరిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది అన్నిసార్లూ సరైన ఫలితాన్నివ్వకపోవచ్చు. అందుకే ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా.. మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకున్నట్టయితే ఎత్తు పెరిగే అవకాశం ఉంది. ఎత్తు పెరగడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలేంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
ఎత్తు పెరగడానికి ఉపయోగపడే కురకూరల్లో బెండకాయ, ఎర్ర ముల్లంగి, గ్రీన్ బీన్స్‌లు ఉన్నాయి. బెండకాయలో ఉండే విటమిన్లు, ఫైబర్, పిండిపదార్థాలు, నీరు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అంతేకాదు బెండకాయ తింటే తెలివితేటలతో పాటు.. ఎత్తు పెరిగే అవకాశం ఉంది. గ్రీన్స్ బీన్స్‌లో ఫైబర్, ప్రోటిన్లు, విటమిన్లు, పిండి పదార్థాలు బీన్స్‌లో పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరిగే అవకాశం ఉంది. ఎర్రముల్లంగిని తరుచూ తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు
 
ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి. ఇది ఎక్కువ దక్షణ ఆసియాలో లభిస్తుంది. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. పచ్చి బఠాణీలు రోజు తీసుకోనడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ దీంట్లో అధికంగా ఉంటాయి. అలాగే, రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల కూడా పెరగవచ్చు.